హత్నూర మండలంలోఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు భూస్వామ్య వ్యవస్థను రూపుమాపి రజాకార్లతో పోరాటం సలిపిన యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా హత్నూర మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండలంలోని కురుమ గొల్ల సంఘానికి చెందిన నాయకులు కొమురయ్య జయంతిని పురస్కరించి వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తోగరిపల్లి శ్రీశైలం, కొమర గోల నాగేష్, చంద్రయ్య, గౌడ్ చర్ల శ్రీశైలం, రాజు యాదవ్, కోణ్యాల శ్రీశైలం, బడంపేట మల్లేశం, రాములు, గొల్ల కురుమ సోదరులు పాల్గొన్నారు.