తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డియంహెచ్ఓ డాక్టర్ శశికళ.
అక్షర విజేత గద్వాల బ్యూరో:
తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు వడదెబ్బకు గురికాకుండా, అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్త వహించాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్ శశికళ సూచించారు.మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా గ్రామాలలో ఆశా కార్యకర్తల సహాయంతో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య క్షేమ సమాచారములు తెలుసుకొని ఆరోగ్య సలహాలు ఇస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వడదెబ్బకు గురి కాకుండా అవసరమైన వారు మాత్రమే ఉదయం బయటకు వచ్చి తమ పనులు చేసుకుని వెళ్లాలని మధ్యాహ్నవేళలో బయటికి రాకూడదని తరచూ నీటిని, మరియు ఇళ్లలో పలుచని మజ్జిగ , నిమ్మరసం, తయారు చేసుకొని తీసుకోవాలని తెలిపారు. ప్రజలు తప్పనిసరి ఎండలో బయటకు వచ్చినచో తలకు టోపీ లేదా టవల్ చుట్టుకొని, కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. సాధ్యమైనంతవరకు తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచూ నీళ్లు తాగాలని, ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, వంటివి తాగడం మంచిదని సూచించారు. వడదెబ్బ తగిలిన వారికి తల తిరగడం, వాంతులు, చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మొదట నిద్రలేఖ, కలవరింతలు ఉండడం,ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలిగి ఉండడం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య అధికారులను సంప్రదించాలని ఆమె తెలిపారు.