పాఠశాల విద్యార్థులకు మజ్జిగ పంపిణీ
…………….మెట్టుపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి దాతృత్వం
అక్షర విజేత,ప్యాపిలి:
రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా ,పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ మెట్టుపల్లి పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు మెట్టుపల్లి పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు డి. చిన్నపరెడ్డి ప్రతిరోజూ విద్యార్థులకు మజ్జిగను పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం పాఠశాల చివరి పనిదినం వరకూ ప్రతి రోజూ కొనసాగుతుందని దాత చిన్నపరెడ్డి తెలిపారు. గత సంవత్సరంలో కూడా వేసవిలో నెలన్నర పాటు మెట్టుపల్లి విద్యార్థులకు ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన తల్లి ధర్మన్నగారి సుభాషిణి జ్ఞాపకార్థం ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని మెట్టుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర గుప్త తెలిపారు. అనంతరం 120 మంది పాఠశాల విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాత చిన్నపరెడ్డి, మెట్టుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర గుప్త, ఉపాధ్యాయ బృందం రమాదేవి,శివ, వాలంటీర్ రమ్య , పాఠశాల వంట మనిషి రామంజినమ్మ, స్కావెంజర్ లక్ష్మిదేవమ్మ,తదితరులు పాల్గొన్నారు.