దేవరకొండ మండల తాటికోల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో 314 వ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఘనంగా వర్ధంతి వేడుకలు.
అక్ష విజేత, .దేవరకొండ
తెలంగాణ గౌడ్ గీత సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.
దేవరకొండ మండలం తాటి కోల్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో తాటికోల్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినది. దీనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గౌడ్ గీతా సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొడితే గోల్కొండ ఖిల్లా కు రాజు కావాలని బహుజన సైన్యం తయారుచేసి తొలి స్వాతంత్ర యోధుడిగా, తొలి బహుజన చక్రవర్తిగా, 18 కోట్లకు రాజుగా చేసినాడు ఇతని ఆదర్శంగా తీసుకొని బహుజనులందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లేటి భాస్కరాచారి, చెల్లమల్ల విజయ్ గౌడ్, పల్చ వీరయ్య గౌడ్, వాల్దాస్ తిరుపతయ్య గౌడ్, పల్చ లాలయ్య గౌడ్, గౌని సత్యనారాయణ గౌడ్, హనుమంతు సైదులు గౌడ్, ఎల్లయ్య, లక్ష్మీనారాయణ, నిరంజన్, కృష్ణ గౌడ్, భద్రయ్య, పెద్దయ్య, అంజి గౌడ్, వెంకటయ్య, బాలరాజు, రాఘవాచారి, మధుగౌడ్, శివ, సైదులు,ఎల్లయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు…