*కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి *

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మరియు రైతులకు వరి ధాన్యానికి బోనస్ గా క్వింటాల్ కు రూ. 500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన బీ అర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతుల బృందం.
మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలోని ఈ బృందంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, జహీరాబాద్ పార్లమెంట్బీ అర్ ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఉన్నారు
ఈసందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడుతూ…
బీ అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి సూచన మేరకు ఈరోజు రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాం.
అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర కంటే అదనంగా రూ. 500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో ఇది కూడా ఒకటి.
కాంగ్రెస్ పార్టీ అలివికాని హామీలను ఇచ్చింది. రైతులను, పేదలను మోసం చేయడం సరికాదు.
వానాకాలం పంట పోయింది. అయినా ఎక్కడా బోనస్ ఇవ్వలేదు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీనే అడుగుతున్నాం.
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం నిన్నటి నుండి ప్రభుత్వ మద్దతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాబట్టి కొనుగోలు చేస్తున్న ధాన్యానికి బోనస్ రూ. 500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒకవేళ మీరు బోనస్ చెల్లించకపోతే రైతులకు మద్దతుగా ఎప్రిల్ 6న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేస్తాం.
ప్రభుత్వం అప్పటికే దిగి రాకపోతే కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనలు, ధర్నాలు చేస్తాం.
అదేవిధంగా అకాల వర్షాలు, నీళ్ళు లేక ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి.
గత బీ అర్ ఎస్ ప్రభుత్వంలో నష్టపోయిన రైతులను ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం.
డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ అంటున్నారు.
మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి.
ఇవన్నీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆడిన నాటకాలు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి.
రైతులకు మేలు చేసిన పార్టీ బీ అర్ ఎస్ రైతుబంధు ఇచ్చాం, రైతుబీమా అమలు చేసాం. 24 గంటల కరంటు అందించాం.
మేము ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం. అని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు