* కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం
* నవాబు పేట్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ
* వంద రోజుల పాలనలో ఎన్నికల హామీల అమలు
* ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజాశీర్వాదం మెండు
* నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
ప్రజామోదయోగ్యమైన పరిపాలన ఉంటే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు ఆశీర్వదిస్తారని నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకాన్ని సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మంగళవారం మేడిపల్లి వెంకటయ్య అక్షర విజేత వికారాబాద్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మేడిపల్లి వెంకటయ్య స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాపాలను కడిగి ప్రజలకు మేలు చేకూరే పరిపాలన అందివ్వడం సీఎం రేవంత్ రెడ్డికి అభినందనీయమని కొనియాడారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భరత్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో నవాబుపేట మండల పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆర్థికంగా మేలు చేకూరే విధంగా పరిపాలన ఉంటే ప్రజా ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని నవాబ్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో సంఘటితంగా అప్పగించిన పనిని పూర్తిగా సఫలం చేస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మెప్పు పొందుతుండడం హర్షణియమని కొనియాడారు. పామెన భీమ్ భరత్ మార్గదర్శనంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రామదండులా ముందు కొనసాగుతారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు పరచేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కృషి చేస్తుందని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు.