దేశంలో కాంగ్రెస్ కు కాలం చెల్లింది
… పసుపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జీవన్ రెడ్డి వయస్సు మీద పడిందని, దాంతో ఆయన ఇష్టం వచినట్లు మాట్లాడతున్నరని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి అన్నారు గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జీవన్ రెడ్డి అనవసరంగా పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్న చేస్తున్నారని అన్నారు. ఇన్నేళ్లలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎంపీగా అర్వింద్ గెలిచినప్పటి నుంచి ఆర్వోబీలు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ముఖ్యంగా అవినీతి లేని పాలన కొనసాగిస్తున్నారన్నారు. జగిత్యాల పీఎఫ్ఎకి అడ్డగా మారిందని విమర్శించారు. సీఏఏను వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, మరోసారి చేస్తే ఊరుకునేది లేదన్నారు. గత ప్రభుత్వంలోని సీఎం కూతురు చేయని పనులను అర్వింద్ చేసి చూపించారని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కు కాలం చెల్లిం దని, మరోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుందని అన్నారు సమావేశంలో కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక, ఆకుల హేమలత, ఇప్పకాయల సుమిత్ర దేవి , చందుపట్ల వనిత , పంచరెడ్డ లావణ్య , ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, ఆకుల శ్రీనివాస్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు