ముస్లింలకు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది
అక్షర విజేత, మోర్తాడ్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ గ్రామంలో గల ప్రార్థన మందిరంలో ( మజీద్) లో ఇఫ్తార్ విందు జరిగింది. ఇఫ్తార్ విందులో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు తోటి ముస్లిం సోదరులతో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పండ్లు, ఫలహారాలు భుజించారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీ.ఎం .రేవంత్ రెడ్డి ముస్లింల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి కృషి చేయనున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా గతంలో మాజీ సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రతి ఒక సంక్షేమ అభివృద్ధి పథకాన్ని అందించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిర్మాజీ గోపి, మోర్తాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పల అశోక్, ఎం.డి నసీర్, ఎం.డి. జాబేద్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ముస్లిం కుల పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.