గెడ్డం బుజ్జి కుటుంబ సభ్యులతో సిఎం రమేష్
అక్షరవిజేత,పాయకరావుపేట.
పాయకరావుపేట మండలం గుంటపల్లిలో గెడ్డం బుజ్జి ఇంటికి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సిఎం రమేష్ విచ్చేసారు. ఈ సంధర్భంగా గెడ్డం బుజ్జి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. పట్టణంలోని జగతా అప్పారావు ఫంక్షన్ హాలులో జరుగుతోన్న టిడిపి, జనసేన, బిజేపి పార్టీల నాయకులతో జరుగుతోన్న పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు పాయకరావుపేట వచ్చిన సిఎం రమేష్ మార్గ మధ్యలో గుంటపల్లిలోని గెడ్డం బుజ్జి నివాసానికి చేరుకొని అక్కడ కొద్దిసేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. గెడ్డం బుజ్జి నివాసంలో అల్పాహారం చేసి అక్కడ నుంచి పాయకరావుపేట బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, తోట నగేష్బి, గెడ్డం చైతన్య, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.