తగలబడ్డ పెబ్బేరు వ్యవసాయ గోదాముకు చేరుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి
అక్షర విజేత పెబ్బేర్
ఇంకా అదుపులోకి రాని మంటలు
భయభ్రాంతులకు గురైన చుట్టుపక్కల ఇండ్ల జనం
5000వేల సామర్థ్యం గలవ్యవసాయ గోదాం,కోట్ల రూపాయలలో నష్టం
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్లో గోదాం తగలబడ్డ ఘటన స్థలానికి చేరుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎలా జరిగిండొచ్చని స్పందించారు జిల్లాడిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు మరియు మండల అధికారులు మంగళవారం చేరుకోవడం జరిగింది ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం నుంచి నిరంతరం వాటర్ ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే లోకల్ వాటర్ ట్యాంకులతో కూడా మంటలు ఆర్పడం జరుగుతుంది ఈ ప్రమాదానికి గురైన కారణాలు తెలుసుకుని నారా స్థాయిలో దర్యాప్తు చేపడతామని,అలాగే పెబ్బేరు ఎస్సై కూడా దర్యాప్తు చేస్తున్నారు.అంతేకాకుండా జిల్లా పై అధికారుల చేత కూడా దర్యాప్తు చేయిస్తాను,ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రికి తీసుకెళ్తానన్నారు. 5000 సామర్థ్యం గల గోదాములొ, దాదాపుగా 13 వేల కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లో ఉండొచ్చని అంచనా, ఇక్కడున్న అధికారుల ను పిలిచి రిజిస్టర్లు తనిఖీ చేయడం జరిగింది. అలాగే అదేవిధంగా మిగిలిన వరి ధాన్యాన్ని లారీల ద్వారా బయటికి వేరే చోటికి పంపడం జరుగుతుంది. ఎమ్మెల్యే, గన్ని బ్యాగులు వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలకు యోగవిదంగా జరిగిందా లేదా ఏదైనా కారణం చేత జరిగినదా వివరంగా తెలుసుకుంటామన్నారు. అంతేకాకుండా గోదాము చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో ఉన్న జనం కూడా భయభ్రాంతులకు గురయ్యారు
ఇక్కడ పెబ్బేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లు తహసీల్దారు లక్ష్మి డిప్యూటీ తాసిల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అక్కమ్మ, అశ్విని సత్యనారాయణ, భాను ప్రకాష్ రెడ్డి కోటేశ్వర్ రెడ్డి సురేందర్ గౌడ్ వెంకటేష్ గంధం రాజశేఖర్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.