మధిర లొ చలివేంద్రం ను ప్రారంబించిన బ్రదర్ ఈ.సంతోష్ కుమార్.
అక్షరవిజేత, మధిర
మధిర మెయిన్ రోడ్ ఆర్ వి కాంప్లెక్స్ దగ్గర బైబిల్ ఒపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరియు ఆల్ ఇండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ మధిర వారు చలివేంద్రం ను ఏర్పాటు చేసారు. ఈ చలివేంద్రానికి ముఖ్య అతిధి.తెలంగాణ ఉప డైరెక్టర్ డాక్టర్,ప్రొఫెసర్, బ్రదర్ ఈ.సంతోష్ కుమార్ మరియు సి బి టి ప్రిన్సిపాల్ జీడిమెట్ల బ్రదర్ మానిక్యరావు, సి బి టి ప్రిన్సిపాల్ పెనుగంచిప్రోలు బ్రదర్ దావీదు, ఏ ఐ టి సి సి మధిర మండలం ప్రెసిడెంట్ డి. సురేష్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్రదర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ… గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన పరలోకంలో దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అన్న దేవుని మాటకు విలువనిస్తూ మధిర లొ ఉన్నటువంటి ఏ ఐ టి టి సి మండలం కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ చలివెంద్రాన్ని అనేకుల దాహర్తిని తీర్చటం అనేది గొప్ప శుభపరిణామం మరియు దేవునికి ఇష్టమైన కార్యక్రమం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కొండలరావు.శ్యామ్,రమణ,శ్రీను,రాహేలు,బేబీ, పులోమాని, నయోమి, నీలిమ,తదితరులు పాల్గొన్నారు.