కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిఖరం *
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేకు కట్ చేసి నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ఘనంగా పుట్టినరోజున జరుపుకున్నారు. . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిఖరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏనుగుల రవీందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని. అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం..
ప్రాణ దానంతో సమానం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయినాల లింగం మాజీ సర్పంచ్ అరికే సాయిలు మైనార్టీ అధ్యక్షులు ఎండి యూసఫ్ మంతపురి సాయ గౌడ్ మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.