సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలి, మోసపోవద్దు
అక్షర విజేత, మోర్తాడ్
నిజాంబాద్ జిల్లా మండల కేంద్రమైన మోర్తాడ్ గ్రామంలోని టాలెంట్ స్కూల్లో సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు మోర్తాడ్ ఎస్సై అనిల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎవరైనా వాట్సాప్ లలో గాని, ఫోన్ చేసి, లేదా మెసేజ్ లు పెట్టి మీకు ఫలానా లోన్ మంజూరు అయిందని, మీకు లక్కీ డ్రాలో డబ్బులు వచ్చాయని, ఇతరత్రా ద్వారా సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్త పాటించాలని, బ్యాంఖాతా నంబర్లు, ఓటిపి నంబర్లు చెప్పమంటే చెప్పవద్దని మోర్తాడ్ మండల ఎస్సై అనిల్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ జాబ్రి, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు