పూడికతీత పనులు చేపట్టడం పట్ల బస్తి వాసులు హర్షం..
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో:
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డు ఒర్రెగడ్డ లో గత కొంతకాలంగా కాలువలలో పూడిక తీత పనులు చేపట్టక బస్తి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ యువ నాయకులు ఎండీ.జావిద్ ఖాన్ స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సమాచారం అందించగ వెంటనే వారు స్పందించి పరిసరాలను సందర్శించి తక్షణమే మున్సిపల్ సిబ్బందికి సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ ఆదేశాలు జారీ చేశారు. మురికి కాల్వల పూడిక తీత, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల తొలిగింపుతో పాటు చెత్త కుప్పలను పరిశుభ్రంగా చేయించారు.
దానికి ఒర్రెగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.