బాబు జగ్జీవన్ రాం ఆలోచన విధానాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలి

అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం ఆలోచన విధానాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రాం బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి అని, తన జీవితకాలం మొత్తం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సఫలీకృతం చేసిన మహోన్నత వ్యక్తి అని, అణగారిన వర్గాల ప్రజలకు ఉన్నత పదవులు రావడానికి వారు ఉన్నత పదవులు చేసే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని అన్నారు. అలాంటి మహానుభావుడు యొక్క ఆశయాలను ఆలోచనలను దేశ ప్రజలందరూ ఆచరించి ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కులాల వారీగా ప్రజల్ని విభజిస్తూ మతాలవారీగా విభజిస్తూ పరిపాలన చేస్తుందని, గతంలో బాబు జగ్జీవన్ రాం లాంటివారు దేశంలో కుల నిర్మూలన కోసం పోరాడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కులతో జీవించాలని పోరాటం చేస్తే ప్రస్తుతం ఉన్న పాలకులు కులాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మరణం అనంతరం కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉన్న బాబు జగ్జీవన్ రాం యొక్క జయంతి జరుపుకోవడం అభినందనియమన్నారు. ఈ నెల 6న తుక్కు గుడలో పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించే సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగుడ సభ విజయవంతం అయ్యే విధంగా చేసిన కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామని, కావున రేపు జరిగే సభను కూడా విజయవంతం చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కష్టపడాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, విజయ్ పల్ రెడ్డి, మాజీ మేయర్ సుజాత, మహిళా కాంగ్రెస్ నాయకులు గాజుల సుజాత, మలైకా బేగం, మాజీ కార్పొరేటర్ నరేందర్ గౌడ్, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.