ఘనంగా నస్రుల్లాబాద్ మండల్ కేంద్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ 116 వ జయంతి ఘనంగా జరుపుకున్నారు.
భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మండల కేంద్రంలో బీఆర్ఎన్ ముఖ్య నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ ఎంపీపీ విట్టల్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కంది మల్లేష్ మాజీ సర్పంచ్ వెంకట్ రమణ సుంచు సాయిలు మైసా గౌడ్ సయ్యద్ ఖలీల్ మోసిన్ చంద్రశేఖర్ గౌడ్ భాను ప్రసాద్ గౌడ్ మామిడి భూమయ్య టేకుర్ల మహేందర్ వనం వెంకటేశ్వరరావు డి సాయిలు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.