
అక్షర విజేత సిద్దిపేట్
ఎన్నికల నోటిఫికేషన్ వెలువైనప్పటి నుండి జిల్లాలో అన్నీ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ అవగాహనపై సైకిల్ యాత్ర చెస్తున్న సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిష్పాక్షపాతంగా, స్వచ్చందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని సత్తాచాటాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పోలింగ్ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు. ఓటు ద్వారా చైతన్యం వస్తుందన్నారు. బాధ్యత ఓటు హక్కును వినియోగించి దేశాన్ని మార్చవచ్చు అని అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి పోలింగ్ నమోదులో రెండవ స్థానం రావడం శుభపరిణామం అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం ప్రయత్నించాలని అన్నరు. ఈకార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.