సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
అక్షర విజేత కొండపాక
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర కొండపాక నందు సైబర్ అంబాసిడర్ ప్లాట్ ఫామ్ సెర్మనీ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించబడింది ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇట్టి సమావేశానికి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ ప్రతినిధి శ్రీమతి అనిత గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు సైబర్ వల్ల ఎదురయ్య సమస్యలు వాటి పరిష్కార మార్గాలు అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ పూర్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఆవరి అశోక్ గారు పి బాలకిషన్ గారు కే వెంకటనారాయణ గారు ఫిజికల్ డైరెక్టర్ నర్రా భాస్కర్ రెడ్డి గారు శ్రీమతి ఎం శోభారాణి గారు విద్యార్థులకు సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫారం గురించి వివరించారు విద్యార్థులు కూడా సైబర్ వల్ల తమకు తమ బంధువులకు స్నేహితులకు ఎదురైన సంఘటనలు తెలియజేశారు ఉపాధ్యాయులు అవి ఎలా ఎదుర్కోవాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులు అందజేయబడింది.