ఆర్మూర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశం.
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
ఆర్మూర్ లో సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని, ఆర్మూర్ డివిజన్ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు దోండి నారాయణ, అధ్యక్షులు రామ్మూర్తి,ప్రధాన కార్యదర్శి గంగాధర్,ట్రెజరర్ ఎం. సాయన్న ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని,ఇందులో సీనియర్ సిటిజన్స్ పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారని,60 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతరులు ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.