నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాళీ అవుతున్న కారు వికసిస్తున్న కమలం
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నగరంలోని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఘర్ వాపస్ చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. తొమ్మిదోవ డివిజన్ కార్పొరేటర్ సాయివర్ధన్ తో పాటు కులసంఘాల పెద్ద మనుషులు, యూత్ భారీగా బిజెపిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నరేంద్రమోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో వికసిస్తుందని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా, విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో బిజెపి పార్టీ పని చేస్తుందని, కాంగ్రెస్కీ ఓటు వేస్తే సోనియా, సోనియా గాంధీ పిల్లలు బాగుపడతారని, బిఆర్ఎస్ కీ ఓటు వేస్తె కేసిఆర్ కుటుంబం బాగుపడుతుందని, బిజెపి కీ ఓటు వేస్తే మాత్రం భారతదేశ పిల్లలు అందరు బాగుపడతారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ వందరోజుల్లో కాంగ్రెస్ పైన ప్రజలు విశ్వసాన్ని కోల్పోయారని అన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తరువాత కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను గాలికి వదిలి, ఎన్నికల మేనిఫెస్టో తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసారని, బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలే అని, ఆ రెండు పార్టీల ఎజెండా కమిషన్లు, కుంభకోణాలు, కబ్జాలు, దోచుకోవడమే అని ఎద్దేవా చేసారు. బిజెపి నరేంద్రమోదీ పరిపాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, ఈ పదేళ్లలో ఎన్నో విప్లవత్మక విజయాలు సాధించామని హిందువుల ఏళ్ల నాటి కల బాల రాముని అయోధ్యలో ప్రతిష్టించి ప్రపంచదేశాలను భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బిజెపి పార్టీది అని, అలాగే 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్, త్రిబుల్ తలాక్ రద్దు, కామన్ సివిల్ కోడ్, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించిన ఘనత కూడా బిజెపిదే అని, అంతేకాకుండా చిట్టాచివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునే ఏకైక పార్టీ బిజెపి అని, బిఆర్ఎస్, కాంగ్రెస్ మాయ మాటలకూ విస్కుపోయిన తెలంగాణ ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం అన్నారు. తెలంగాణలో అధిక స్థానాలతో పాటు ఇందూర్ లో కూడా మరోసారి కాషాయ జెండా ఎగరడం పక్కా అని, అర్బన్ లో అత్యధికంగా లక్ష ఓట్లు సాధిస్తామని ధీమా వక్తం చేసారు. ఘర్ వాపసిలో భాగంగా తిరిగి బిజెపి పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.