అమ్మ ఆదర్శ కమిటీ లను ఏర్పాటు చేయాలి
ఏఏపీ కమిటీలే పాఠశాల నిర్వహణను పర్యవేక్షిస్తాయి
జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఆయా గ్రామాల మహిళా ఐక్య సంఘం (వి.ఓ)అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఒక్కొక్క తరగతి నుండి ముగ్గురు తల్లులతో మహిళా సంఘం సభ్యులు కమిటీలను ఏర్పాటు చేయాలని, ఇకపై పాఠశాలల్లో జరిగే సివిల్ వర్క్స్ పనులు కమిటీ తీర్మానం తోనే కొనసాగుతాయని తెలియజేశారు. ఏ.ఏ.పీ. కమిటీలే పాఠశాల నిర్వహణను పర్యవేక్షిస్తాయన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగు నీరు, విద్యుత్తు, తాత్కాలిక మరమ్మత్తులకు తగు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మత్తు లను పూర్తిచేయాలన్నారు. ఆ దిశగా అందుకు అవసరమైన ఎస్టిమేట్ లను తక్షణమే అందించాలని పంచాయత్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఏ.ఏ.పీ కమిటీలు సేవాభావంతో పని చేసి ఆయా గ్రామల్లోని పాఠశాలల్లో విద్యా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డిఆర్డిఓ నర్సింగ్ రావు, పంచాయతీరాజ్ ఈఈ విజయకుమార్, జిల్లా విద్యా శాఖ అధికారిని ఇందిరా, జిల్లా సెక్టోరల్ అధికారి హంపయ్య తదితరులు పాల్గొన్నారు.