పద్మశాలీలతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా
అక్షర విజేత, మోర్తాడ్
బాల్కొండ నియోజకవర్గం లో సీ.ఎం. రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు, జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, కిసాన్ కేత్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, జిల్లా, రాష్ట్ర ,కాంగ్రెస్ నాయకులందరూ సమిష్టిగా సహకారంతో సంయుక్తంగా అన్ని వర్గాల ప్రజల కు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి నిజాంబాద్ జిల్లా ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయ దుందుభి మోగేలా కృషి చేస్తామని మాజీ ప్రభుత్వ విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. సోమవారం మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ స్వ గ్రామమైన కిషన్ నగర్ గ్రామంలో పలు వివిధ గ్రామాల మండల కు చెందిన పద్మశాలి ప్రజాప్రతినిధులు, పలువురు పద్మశాలి కుల పెద్దలు, సభ్యులు, మాజీ ఎంపీపీ,కిషన్ నగర్ తాజా సర్పంచ్ నాగభూషణం, సీనియర్ జర్నలిస్టులు నేటి వార్త బ్యూరో సీనియర్ జర్నలిస్ట్, మరియు తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ బండి నారాయణ లు మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రిని కలిసి శాలువలు కప్పి, సన్మానించి సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. కొందరు పద్మశాలి ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు, సంఘ సభ్యులను మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ముచ్చటించి పలు సలహాలు, సూచనలు తెలుసుకొని, చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రిఅనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని అన్ని నాయకుల తో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి, లోక్సభ ఎన్నికల్లో ఎంపీ గెలుపుకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఏ పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని, అందుకు నిదర్శనం తనకు రాష్ట్ర ఖనిజ గనుల చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి రాష్ట్ర సొసైటీల సంఘ చైర్మన్గా, సీ.ఎం.రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి ఉన్నతపదవులు అందించడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల కు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, జిల్లా ఎంపీ అభ్యర్థి సునాయాస గెలుపుకై కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మండలాల పద్మశాలి నాయకులు, కుల పెద్దలు, సంఘ సభ్యులు, పలువురు జర్నలిస్టులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ,పాల్గొన్నారు.