నా బలమంతా కార్యకర్తలే
రఘు అన్న గెలుపు అభివృద్ధికి బాట
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ,
అక్షరవిజేత, దేవరకొండ
డిండి గుండ్లపల్లి మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా ఎన్నికల్లో కార్యకర్తల శ్రమ ఫలితంమే నా గెలుపు అన్నారు. ఈ ఎన్నిక మీకు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, సింగల్ విండో, వార్డ్ మెంబర్ లతో సహా గెలిచే ఎన్నిక అని అన్నారు, అందుకు అందరూ రాత్రి పగలు శ్రమించి, భారీ మెజారిటీతో రఘువీర్ రెడ్డి ను ఎంపీగా గెలిపించలగరు అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.దేవరకొండ ప్రాంతాన్ని సాగునీరు అందించడమే నా చిరకాల కోరిక అని అన్నారు.రెండున్నరేళ్లలో దేవరకొండ ప్రాంతాన్ని కాలువల ద్వారా సాగునీరు అందించేలా నేను మాజీ మంత్రి జానా రెడ్డి పని చేస్తున్నాం అని అన్నారు.నాకు బలగం అంత మీరే కావున మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల సంగ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బలపరిచిన అభ్యర్థి రఘువీర్ రెడ్డి, అండగా నిలబండేందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులు సిద్ధమేనా అని ఎమ్మెల్యే అన్నారు.
పార్టీ పొత్తులతో కెసిఆర్ ప్రజలే బలగం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,అని సంకల్పం వ్యక్తం చేశారు.రాహుల్ గాందీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కార్యకర్తలు ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మనం పాలకులం కాదు సేవకులం.భవిష్యత్తులో మరిన్ని అభివృధి చేసుకుందాం అన్నారు