కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి ఆదివాసీ లా మద్దతు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నగరంలోని బృందావన్ గార్డెన్ లో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశం ఈ నెల 7న ఆదివాసీ గిరిజన బంజారా సమావేశం ఏర్పాటు చేయనున్నామని గిరిజన అది వాసీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్ కేతవత్ యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామో అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ తో గెలిపించూకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్క గిరిజన బంధువులు హాజరు కావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఉన్న ఆదివాసీలు, లంబాడా సోదరులు అందరూ పెద్ద ఎత్తున రావాలని పిలుపు నిచ్చారు. అందరం ఏకమై మన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేద్దామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి గిరిజనులను మీరు చేసింది చాలని, బీజేపి ని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఎంపీ అరవింద్ మీరు ఏ ఒక్క గిరిజన తాండకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని నెత్తి మీద మోసిన ఘనత గిరిజనుదని, కానీ వారికి ఎలాంటి లాభం చేయలేదని అన్నారు. బిజెపి పార్టీ కూడా ఏమీ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా గాంధీ గిరిజనులకు ఇల్లు కట్టించి, లోన్స్ ఇచ్చి, బోర్లు వేయించి గిరిజనులను ఆదుకున్నదని అన్నారు. అలాంటి పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించుకుంటామని అన్నారు. రాష్ట్ర స్థాయి బంజారా సేవ సంఘం కార్య నిర్వాహక అద్యక్షులు, రాంపూర్ పిఎసీఎస్ చైర్మన్ తారచంద్ మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ అధ్వర్యంలో ఐదు నియోజక వర్గాల పరిధిలో అదివాసి గిరిజన సమావేశానికి విచ్చేసి మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మేల్యే సుదర్శన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి తో పాటు బంజారా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరుకానున్నారని అన్నారు. ఆదివాసి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరై బంజరుల ఐక్యతను చాటాలని అన్నారు. బిజెపి బీఆర్ఎస్ ఎన్నడూ బంజరుల సమస్యలపై పోరాటలేదని, ఏ ఒక్క తండాకు వెళ్లి మన బాధలు, గాథలు వినలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇస్తే మన సమస్యలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ పట్టణ అద్యక్షులు సుభాష్ జాదవ్, మల్కాపూర్ మాజీ సర్పంచ్ ప్రకాష్ నాయక్, రాజు, ఆదివాసీ వైస్ చైర్మన్ బాల్ రాజు నాయక్, ధర్పల్లి మండల అధ్యక్షుడు మంగ్త్య నాయక్, రూరల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్, మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షులు రవీందర్, వినోద్, దాదు రావు పాల్గొన్నారు.