ఘనంగా రేణుక మాతా అభిషేకం….
కొల్చారం, అక్షర విజేత:-
అమ్మా రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరు చల్లగా ఉండాలని గౌడ సంఘం సభ్యులు కోరుకున్నారు . అమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవము అనంతరం 14 వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘంచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేక,అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా చల్లూరి కృష్ణ శర్మ, సాగరికల మంత్రోచ్ఛహరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో , రామకృష్ణ గౌడ్ ,పాపగౌడ్,సుధాకర్ గౌడ్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.