ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ
కాపాడిన బ్లూ కోర్టు సిబ్బంది
అక్షర విజేత మల్యాల కొండగట్టు
మల్యాల క్రాస్ రోడ్ సమీపంలోని వరద కెనాల్ లో మేడిపల్లి మండలం కొండాపూర్ కు చెందిన బొల్లె లక్ష్మి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బ్లూ కోర్టు సిబ్బంది ప్రసాద్ నర్సింగరావు కు సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకొని మహిళను రక్షించారు.లక్ష్మి గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతుందని మల్యాల లోని తన అమ్మమ్మ ఇంటికి వస్తు ఆత్మహత్య ప్రయత్నించింది,వరద కాలువ లో నీరు తక్కువ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది,
మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి,వారి బంధువులకు సమాచారం అందించడంతో తన కుమారుడు వచ్చి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.