💐అంబేడ్కర్ విగ్రహ పనుల కోసం 25,000- స్వచ్ఛంద విరాళం💐
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
బీర్కుర్ మండలంలోని బరంగ్ ఎడ్గి గ్రామానికి చెందిన శ్రీ నీరడి శివయ్య ఆ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న భారత రత్న డా. బి. ఆర్. అంబెడ్కర్ విగ్రహ పనుల నిమిత్తం కోసం స్వచ్ఛందంగా 25,000/- రూపాయలను విరాళంగా బాబా సాహెబ్ యువతకి అందజేశారు.యూత్ సభ్యులు ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చే ఒక చిన్న నివాళిలో అందరూ ఎదో విధంగా సహకారం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రధాన కార్యదర్శి గంగాధర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు,రాజు, బస్వంత్,ప్రవీణ్,సిద్దు, వివేక్,భాను తదితరులు పాల్గొన్నారు.