బోయవాడ పాఠశాల 20 వసంతాల వార్షికోత్సవం
అక్షర విజేత పిట్లం.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండల కేంద్రంలో గల ఎంపీపీ ఎస్ బోయవాడ పాఠశాల ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడి 20 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాఠశాల వార్షికోత్సవం మరియు ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు నాటికలు ఇటు తల్లిదండ్రులను అధికారులను బాగా ఆకర్షితులను చేశాయి*.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి శ్రీదేవి సింగ్ మాట్లాడుతూ పాఠశాలను ఎంతో ఆహ్లాదకరమైస వాతావరణంగా తీర్చిదిద్ది మండలంలోని ఏ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకూడా ఇంత గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదని అందరికీ అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేయడంలో ప్రధానోపాధ్యాయులు నారాయణ సార్ కు మించిన వారు లేరని పొగుడుతూ ఆయన ఒక పాఠశాలకు* ప్రధానోపాధ్యాయులుగానే కాకుండా అత్యధిక ఉపాధ్యాయులు ఉండే ఒక సంఘానికి సంఘ ప్రతినిధిగా ఉంటూ *ఉపాధ్యాయులకు తనదైన శైలిలో సేవలందిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేయడంతో అందరి మన్ననలను పొందుతున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు తమ పిల్లలు చేసిన రకరకాల నృత్యాలను చూసి ఆనంద పడుతూ వేలుకొలది డబ్బులు చెల్లించిన ప్రైవేటు పాఠశాలలో కూడా లేనటువంటి విద్యా మెలకువలను బోధిస్తూ, విద్యతోపాటు అనేక రకాల సహ పాఠ్య కార్యక్రమాలు మరియు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి శ్రీ రమణారావు , రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శ్రీలత మేడం చిన్న కొడప్ గల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అనురాధ మేడం , రిటైర్డ్ పిట్లం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కులకర్ణి గణేష్ రావు గోద్మేగాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస సూరి , పి ఆర్ టి యు పిట్లం మండల సంఘ నాయకులు పి బన్సీలాల్, మాణిక్యరావు, రవీందర్ జెట్టి , ప్రభాస్ కుమార్, సంతోష్ రెడ్డి , సంగమేశ్వర్ , ఉపాధ్యాయులు హట్టీ సింగ్,రమేష్ వర్మ, ఎం ఆర్ సి బృందం, పాఠశాల సిబ్బంది శరణ్య, రమేష్,నవనీత, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.