వాంకిడి టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద రూ.1 లక్ష పట్టివేత
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం 4గంటలకు వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1లక్ష నగదును పట్టుకున్నట్లు వాంకిడి సీఐ శ్రీనివాస్ తెలిపారు చంద్రపూర్ నుంచి మంచిర్యాల కారులో వెళ్తున్న చంద్రపూర్ కు చెందిన వ్యక్తి వద్ద రూ. 1లక్ష , నగదును కాగజ్ నగర్ రూరల్ సీఐ రాం బాబు పట్టుకున్నట్లు వివరించారు సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు పట్టుకున్న నగదును ఎఫ్ఎస్టి టీంకు అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు ఈ తనిఖీల్లో వాంకిడి సీఐ శ్రీనివాస్ ఎస్సై సాగర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు