దేవరకొండ మున్సిపాలిటీ వార్డులలో నీటి సమస్యలు పరిష్కరించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
అక్షరవిజేత, దేవరకొండ
దేవరకొండ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కొంతమంది సభ్యులు వివిధ వార్డులలో ఉన్నటువంటి నీటి సమస్యలు బీసీ సంక్షేమ సంఘం దృష్టికి రాగా బీసీ సంక్షేమ సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డులలో మున్సిపాలిటీ సరఫరా చేసే నీటి సరఫరా ఐదు రోజులు ఒకసారి, వారానికి ఒకసారి రావడం వలన ఇంటిలో ఉన్నటువంటి బోర్లు ఎండాకాలం రావడం వల్ల బోర్లలో నీళ్ళు లేకుండా కనీస అవసరాలు వాడుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ఇట్టి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గ్రహించి నివేదిక తెప్పించుకొని ఏ వార్డులలో రోజువారి నీటి సరఫరా సక్రమంగా లేక ఆగిపోయిందా వాటిని వెంటనే గుర్తించి నీటిని సరఫరా చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేనియెడరా మున్సిపల్ కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి చోల్లేటి భాస్కరాచారి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రాచమల్ల నాగయ్య ముదిరాజ్,
యాదవ సంఘం నాయకులు గెలమొని యాదయ్య,బీసీ సంఘం పట్టణం ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్,ఆర్యవైశ్య సంఘం వాణిజ్య సెల్ జిల్లా నాయకులు ఆలంపల్లి శ్రీనివాసులు,బీసీ మైనార్టీ సంఘం అధ్యక్షులుఎండి అబ్దుల్ కలాం,
కోప్పెర శ్రీను తదితరులు పాల్గొన్నారు