ఇసుక మాఫియా ఉండదు
అక్షరవిజేత, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి, జడ్పిటిసి గుండం నరసయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు ఇసుక ఒక మాఫియాగా ఉండదు అని చెప్పి ప్రత్యక్షంగా ఏలాంటి డీడీలు లేకుండా నేరుగా వాళ్ళ ఇంటి అవసరాలకు దళారుల మధ్యన కాకుండా వారి ఇంటికి ఇసుక అందజేయడానికి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాలు ఇష్టాను సారంగ మార్చుకొని క్వారీలంటూ గవర్నమెంట్ ఆఫీసులకు పర్మిషన్ లంటూ ఇసుకను ఏదేచ్ఛగా అమ్మడం జరిగింది.ఈ ఇసుకను అక్రమంగా తరలించడం ద్వారా ప్రమాదాలు జరిగి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొంతమంది బడా బాబులు మండల నాయకులు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడికి ఇసుకను తరలించడం,అడ్డు వచ్చిన వాళ్లను కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైనం మనం చూసాం.కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏలాంటి ఇబ్బందులు జరగకుండా ఇల్లు కట్టుకుని ప్రతి పేదవానికి ఇబ్బందులు లేకుండా ఇసుకను అందించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు,ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, వెలుగుల రామ్ రెడ్డి ముచ్చుడి బాల్ రెడ్డి రంజాన్ నరేష్ తలారి నర్సింలు, కొమురయ్య, శీల ప్రశాంత్, కొమురయ్య కొండల్ రెడ్డి కొప్పు రమేష్ సద్ది మధు ఆంజనేయులు, తదితురులున్నారు.