వివాహితను హత్య చేసింది మాజీ భర్త
సీఐ నీలం రవి
అక్షర విజేత మల్యాల కొండగట్టు
మల్యాల మండలంలోని మ్యాడంపెళ్ళి గ్రామ శివారులో 17 మార్చి జరిగిన హత్యకు సంఘటనకు సంబంధించిన నిందితున్ని పట్టుకొని మంగళవారం మల్యాల పోలీస్ స్టేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం ప్రేమించి వివాహం చేసుకున్న తనను కాదని విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నదని మాజీ భార్యపై ద్వేషంతో పతకం ప్రకారం హత్య చేసిన మొదటి మాజీ భర్త నేరస్తుడు కొల్లూరి నరేష్ జగిత్యాల లోని వాటర్ ప్లాంట్ లో 2018 వ సంవత్సరం పనిచేస్తున్న అంజలితో పరిచయమై వారిద్దరూ ప్రేమించుకొని 2020వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారని. మనస్పర్ధలతో 2022వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారని,కొద్దిరోజుల తర్వాత అంజలి యాదాద్రి జిల్లా మాసం పెళ్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని రెండో వివాహం చేసుకొని జీవిస్తుంది తనను కాదని అంజలి రెండో వివాహాన్ని చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్ ఆమెను తరచుగా వేధింపులకు గురిచేసి చివరకు ఆమెను హతమార్చాలని ఉద్దేశంతో అంజలి కి ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తనతో మాట్లాడాలని జగిత్యాలకు రమ్మని చెప్పగా అతని మాటలు నమ్మి 17వ తేదీ జగిత్యాలకు వచ్చిందని ఆమెను తన వాహనం టీఎస్ 21 బి 0351 స్కూటీ పై ఎక్కించుకొని గొల్లపల్లి రాఘవపట్నం మీదుగా మ్యాడంపెల్లి శివారుకు తీసుకువెళ్లి సుమారు రాత్రి 9:30 గంటల సమయంలో ఎవరూ లేనిది గమనించి అంజలి గొంతు నిలిమి చంపి రోడ్డుపై నుండి లాగి పక్కనే ఉన్న కందకంలో పడేసి వెళ్లిపోయాడని తెల్లవారి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వెళ్లిన పోలీసులు మృతురాలినీ గుర్తించి ఆమె తల్లికి తెలుపగా మృతురాలు అంజలి అని చనిపోయిందని అంజలి అని నిర్ధారించి తల్లి గుజ్జల రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు అంజలి ఫోన్ కాల్ డాటా ద్వారా సి సి ఫుటేజ్ టెక్నాలజీ సాయంతో అంజలి మొదటి భర్త నరేష్ హత్య చేసినట్లుగా నిర్ధారించుకొని ఎస్సైలు అబ్దుల్ రహీం కుమారస్వామి రెండు టీంలుగా ఏర్పడి అతడి కోసం గాలిస్తుండగా నిందితుడు నరేష్ తప్పించుకుని మంగళవారం హైదరాబాద్ పారిపోతుండగా కొండగట్టు బస్టాండ్ వాహనాల తనిఖీలు పట్టుకొని ఎంపీడీవో మరియు పంచుల సమక్షంలో విచారించి రిమాండ్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లుగా తెలిపారు.