కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
— స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ పెట్టెమ్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి
హైదరాబాద్లో గాంధీ భవన్ నందు స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టెమ్ అధ్యక్షతన నిర్వహించిన అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల ముఖ్య సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ బుధవారం గాంధీ భవన్ లో స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ పెట్టెమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల ముఖ్య సమావేశంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ పాల్గొనడం జరిగింది. స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మనకందరికీ ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. కావున రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ ద్వారా ప్రతి ఓటర్ కు చేరే విధంగా షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.