ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు
రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
ఎస్సీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు బేగారి గాలయ్య
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పటివరకు రుణమాఫీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎస్సీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గాలయ్య కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎస్సీ దళిత మూర్ఛ జిల్లా అధ్యక్షులు బేగారి గాలయ్య మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలవేళ చెప్పిన మాటలు,ఇచ్చిన హామీలు అన్ని బూటకపు మాటలని ఆయన అన్నారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంమాట తప్పిందన్నారు. ఓ పక్క జిల్లాల వ్యాప్తంగా కరువు తాండవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. మరో పక్క బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని గాలయ్య అన్నారు. మోడీ సఫల్ బీమాను అమలు చేయని రాక్షస తెరాస కాంగ్రెస్ పార్టీలు.కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు సర్వ నాశనమవుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ మల్లేశం జిల్లా కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ ఎస్సీ దళిత మోర్చా ఉపాధ్యక్షులు కే శేఖర్ జిల్లా కార్యదర్శిలు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు