
–బత్తిని మద్దిలేటి పి హెచ్ డి బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానీయా యూనివర్సిటి
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి:
ఉపాద్యాయ అర్హత పరిక్ష(టెట్)కు దరఖాస్తు ఫీజు పెంచడంతో పేద, మద్యతరగతి నిరుద్యోగులపై అధికభారం పడి, మెగా కి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తూన్నాయాని ఉస్మానీయా యూనివర్సిటి బి ఆర్ ఎస్ విద్యార్థి నాయకుడు, పిహెచ్.డి స్కాలర్ బత్తిని మద్దిలేటి అన్నారు. సోమవారం ఆయాన ఒక ప్రకటనలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టెట్ ఒక పేపర్ దరఖాస్తు ఫీజు రూ. 200 ఉండగా కాంగ్రేస్ పరభుత్వం దాన్ని రూ. 1000 పెంచింది. రెండు పేపర్ల కు గాను గతంలో రూ. 300 ఉండగా ప్రస్తుతం రూ. 2000 లకు పెంచడం సరికాదని అన్నారు. టెట్ పరిక్ష సెంటర్లు కేవలం 11 జిల్లా కేంద్రాలకు పరిమితం చేయడం వలన నిరుద్యోగులపై అధిక ఆర్థికబారం పడుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరిక్ష కేంద్రాలను ఎర్పాటు చేయాలన్నారు. 7 లక్షల మంది నిరుద్యోగులను పరిధిలోకి తీసుకుని దరఖాస్తు ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రెట్లు ఫీజు పెంచి తన అసలు స్వాభావన్ని ప్రదర్శిచిందని దయ్యబట్టారు. ఫీజులు తగ్గించనిచో నిరుద్యోగలంత కలసి రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రేస్ కు తగిన బుద్ది చెప్తామని అన్నారు.