పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నగరంలోని వినాయక్ నగర్ లో పేకాట స్థావరంపై గురువారం సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు, రూ.56810 పట్టుకోవడం జరిగిందన్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాము లు పాల్గొన్నారు.