తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టండి
తాగు నీటి వృధాను అరికట్టండి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
బుధవారం కలెక్టరెట్ లోని కాన్ఫరెన్సు హాల్లో తాగునీటి సమస్య, ఉపాధిహామీ పనుల పై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్లతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో తాగు నీటికి ఎలాంటి కొరత లేదని మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంలో సరైన పర్యవేక్షణ, సమన్వయం అవసరం ఉందన్నారు. కొన్నిసార్లు సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చని స్యినప్పటికి ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ పద్దతుల్లో నీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు స్థానికంగా ఉన్న బోర్లు, మోటార్లు రిపేర్లు చేయించి పెట్టుకోవడం, లీకేజీ లు లేకుండా చూసుకోవడం అవసరమైతే ప్రైవేట్ బోర్లు లీజుకు తీసుకుని నీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ సిబ్బంది ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యలు తెలుసుకొని, పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారంలో 3 రోజులు తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల వారీగా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరా వ్యవస్థ లో ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను అదేశించారు. అదేవిధంగా, తాగు నీటి వృధాను అరికట్టి, నీటి పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో నీటి వనరులు, సరఫరా వ్యవస్థలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వేగంగా పరిష్కరిచాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల కోసం సంప్రదించేందుకు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, ఎంపీవో, ఆర్ డబ్ల్యూఎస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫోన్ నంబర్లు ప్రతి గ్రామపంచాయతీ భవనం ముందు బోర్డులు రాయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
లేబర్ మొబిలైజేషన్ పెంచాలి
ఉపాధి హమీ పనుల్లో లేబర్ మొబిలైజేషన్ తక్కువ ఉందని కారణాలపై నివేదిక సమర్పించాలని సిబ్బందిని కలెక్టర్ అదేశించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సకాలంలో మస్టర్ పూర్తి చేసి సమయానికి కూలి డబ్బులు అందే విధంగా చూడాలని,
నిర్లక్ష్యంగా బాధ్యతా రహితంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సరీలలో, హరితారంలో నాటిన మొక్కలకు సక్రమంగా నీటిని అందించి రక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఫాగింగ్, బ్లీచింగ్ చేస్తూ దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పి.డి డీఆర్డీవో ఉమాదేవి, డీపీవో రమణ మూర్తి , మిషన్ భగీరథ ఎస్. ఈ జగన్మోహన్, వెబ్ ఎక్స్ ద్వారా ఎంపీడీవో లు, ఎపి.ఒ లు, డి. ఈ లు, ఎ.ఈ లు పంచాయతీ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు