రైతులకు కంపోస్టు ఎరువు సరఫరా
అక్షర విజేత సిద్దిపేట్
మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం మంగళవారం మందపల్లిలో రిసోర్స్ పార్కులో తయారుచేసిన కంపోస్ట్ ఎరువును అవసరమైన రైతులకు సప్లై చేయడం జరిగింది. మంగళవారం కమిషనర్ ప్రసన్న రాణి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దిలీప్, అలాగే సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు రిసోర్స్ పార్క్ మైంటైన్ చేయు శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో సయ్యద్ మక్సూద్ సలీం అనే రైతుకు 4060 కిలోల ఎరువు ను రూ. 40,600/- రూపాయలకు విక్రయించడం జరిగింది.