షీ టీం లక్ష్యం మహిళల భద్రత
అక్షరవిజేత, ముస్తాబాద్
ముస్తాబాద్ మండల కేంద్రం లోని స్థానిక నవ జ్యోతి పాఠశాలలో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లాలో విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలని అన్నారు మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విద్యార్థినిలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్న ఎవరైనా ఇవ్విటీజింగ్ పాల్పడితే.నేరుగా 8712656425 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీం ఏ ఎస్ ఐ ప్రమీల, ప్రియాంక, రమాదేవి,పాఠశాల కరస్పాండెంట్ కేజె ప్రకాష్ ఉపాధ్యాయనీలు స్రవంతి, సునీత,లత,మాధవి. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.