ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆసిస్టెంట్
ఎంపీడీఓ చెబితేనే లంచం తీసుకున్న
ఇద్దరిని విచారించి కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

అక్షర విజేత నిజామాబాద్ ప్రతినిధి
జిల్లాలోని కమ్మర్ పల్లి మండల పరిషత్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు మంగళవారం జరిపిన దాడులు కలకలం రేపాయి. గత అసెంబ్లీ ఎలక్షన్ లో కొన్ని రోజులే కమ్మర్ పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పని చేసి వెళ్లిన భాగయ్య అనే ఉద్యోగి, తన సర్వీస్ బుక్ లో సర్వీస్ సమాచారం నమోదు చేయాలని సీనియర్ అసిస్టెంట్ ను అడగగా అందుకు రూ.10వేలు డిమాండ్ చేసాడు. దాంతో సరే అని అంగీకరించిన భాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం భాధితుడు ప్లాన్ ప్రకారం సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకు లంచం డబ్బులు రూ.8వేలు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. హరిబాబును అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు ఆయన్ని విచారించాగా, అప్పటి ఎంపీడీఓ ఉద్యోగి భాగయ్య వద్ద లంచం తీసుకొమ్మన్నాడని, అందుకే తీసుకొన్నానని ఏసీబీ అధికారులకు చెప్పాడు. దాంతో ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బికనూర్ లో పని చేస్తున్న ఎంపీడీఓ సంతోష్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కమ్మర్ పల్లి కి తీసుకొచ్చి ఇద్దరు నిందితులను విచారించారు. విచారణ అనంతరం ఏ.1 గా ఎంపీడీఓ సంతోష్ రెడ్డిని, ఏ.2 గా సీనియర్ అసిస్టెంట్ హరిబాబు పై కేసు నమోదు చేశారు. నిందితులను ఇద్దరిని రిమాండ్ కు పంపనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.