నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
అక్షర విజేత జుక్కల్ ప్రతినిధి
అక్రమంగా మద్యం నగదు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలు రావడంతో బిచ్కుంద మండల కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో వాహనాలకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వాహనాలలో అక్రమంగా నగదు,మద్యం,నగలు రవణ చేయడం నేరమని చెప్పారు. 50వేలు మించి నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామన్నారు. నగదు,నగలకు సంబంధించిన ద్రువపత్రాలను విధిగా తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సు, ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్, బండి నెంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.లేనియెడల వాహనం సీజ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పాండురంగ్,మధుకర్, హోంగార్డ్ మధు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.