* బిజే వైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా సాయి గౌడ్ నియామకం
* పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తా
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
బిజే వైఎం జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి బీజేవైఎం నూతన కమిటీ ని మంగళవారము ప్రకటించారు. ఈ కమిటీ లో దారూర్ మండలానికి చెందిన సాయి గౌడ్ ను జిల్లా ఉపాధ్యక్షులు గా, నవభారత్ రెడ్డి ని కార్యదర్శి గా నియమించారు. ఈ సందర్భంగా సాయి గౌడ్ అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ “నాపై నమ్మకంతోఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వర్తించి పార్టీ ఎదుగుదల కోసం పనిచేసి యువత సమస్యల కోసం పోరాడతాననీ పేర్కొన్నారు. మండలంలో పార్టీ సీనియర్లతో కలిసి పనిచేస్తాను అని తెలియజేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన డీజే వయం జిల్లా అధ్యక్షులు సాయిచరణ్ రెడ్డికి, బిజెపి జిల్లా అగ్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.