బస్టాండ్ ముందు ఉన్న డబ్బాల తొలగింపు…
అక్షర విజేత, మరికల్/ ధన్వాడ:
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న డబ్బాలను, తొలగించాలంటూ గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది, మరికల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తొలగింపు కార్యక్రమాన్ని మంగళవారం నాడు నిర్వహించారు. ప్రస్తుతము తొలగించిన డబ్బాల స్థలాల వద్ద తోపుడు బండ్లు ద్వారా వ్యాపారం చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అట్టి స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు సమయం పడుతుందన్నారు.ఎన్నికల అనంతరం అట్టి స్థలంలో షాపులను ఏర్పాటు చేసి టెండర్ల ద్వారా పిలుస్తామని మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.డబ్బాలు తొలగించిన వరకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Super sir