అప్పంపల్లి యువకుడికి రంగస్థల యువ పురస్కారం
●ప్రకటించిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
అక్షర విజేత దేవరకద్ర
కౌకుంట్ల మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన ఎండి అబ్దుల్ ఖలీమ్ ఆజాద్ కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 24 సంవత్సరానికిగాను యువ పురస్కారం ప్రకటించింది ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని మార్చి 27న హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందించనున్నారు. అప్పంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006లో 10వ తరగతి పూర్తి చేసుకున్న ఖలీమ్ అంచలంచలుగా ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లమో పూర్తి చేసిన అనంతరం బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తో పాటు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కళారంగంలో ఎం ఏ. థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండే పద్యనాటకంలో పీజీ పూర్తి చేసి పలు వేదికల మీద ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక, సందేశాత్మక నాటికలతో పాటు పద్య నాటకాలలో నటించడంతోపాటు కొన్నింటికి స్వయంగా దర్శకత్వం వహించారు. ఖలీమ్ కృషిని గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం 2023 24 సంవత్సరానికి గాను యువ యువ పురస్కారానికి ఎంపిక చేసింది తమ గ్రామానికి చెందిన యువకుడికి పురస్కారం లభించడం పట్ల మాజీ సర్పంచ్ సువర్ణ అశోక్ రెడ్డి ఎంపీటీసీ నెల్లి మనోహర్ రెడ్డి రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు మన్యం గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిశంకర్ ఉపాధ్యాయులు గుముడాల చక్రవర్తి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు