రామగుండం సీపీ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
– పార్లమెంట్ ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే పిడి యాక్ట్ నమోదు
– నేర ప్రవృత్తిని వీడి సమాజంలో హుందాగా జీవించాలని
– రౌడీషీటర్స్ పైన ప్రత్యేకంగా పోలీస్ నిఘా
ఉంటుంది
– రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో..
రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల జిల్లా పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు.మారేందుకు వారికి ఇది సదా అవకాశం నేరప్రవృత్తిని వీడి నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ పత్రిక సమావేశంలో పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో రౌడీషీటర్లలో మార్పు కోసం కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను పిలిచి కౌన్సిలింగ్ రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతి రౌడీషీటర్ జీవన విధానాన్ని వృత్తి రీత్యాను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అలజడి సృష్టించిన నేరాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు పిడి యాక్ట్ క్రింద కేసు నమోదు చేస్తామని అన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు.నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రౌడీషీటర్లు తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని. రౌడీషీటర్ అనే పదం తమ బిడ్డల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తుందన్నారు.నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఉందని సీపీ తెలియజేశారు.