గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన
దూదిపాళ్ల విజయకుమార్
అక్షర విజేత కారేపల్లి
కొత్త కమలాపురం అనే కుగ్రామం నుంచి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా(పీఆర్వో) దూదిపాళ్ల విజయ కుమార్ ఎదగడం అభినందనీయమని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో విజయ కుమార్‌ను మంగళవారం కలిసిన డాక్టర్ అశోక్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేశారు. విజయకుమార్ చిన్ననాటి నుండి చదువులో, ప్రజా సంబంధాలలో వినూత్నమైన పద్ధతిలో చురుకుగా ఉండేవాడని, ఈనాడు జర్నలిజం స్కూల్‌కు ఎంపికై ఆ సంస్థలో 17 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో ఉప సంపాదకునిగా, స్టాఫ్ రిపోర్టర్‌గా పని చేశారని తెలిపారు. ఢిల్లీలో ఈనాడు అసిస్టెంట్ చీప్ రిపోర్టర్‌గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రికి పీఆర్వోగా నియామకం కావడం కొత్త కమలాపురం ప్రజలందరికీ సంతోష దాయకమని అన్నారు.