క్షేత్ర పర్యటనలో భాగంగా పోస్ట్ ఆఫీస్ సందర్శన
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కామర్స్ విద్యార్థులు గురువారం క్షేత్ర పర్యటనకు వెళ్ళినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మేడ తిరుపతి, డాక్టర్ కాంపల్లి శంకర్, అధ్యాపకులు పి.రవి, ఓ కిషన్ ల ఆధ్వర్యంలో ఈ క్షేత్ర పర్యటన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ను విద్యార్థులు సందర్శించారు. పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా బీమా అను పథకాల గురించి అక్కడి సిబ్బందిని సంబంధించిన వివరాలు, సందేహాలు అడిగి అవగాహన చేసుకున్నారు. కేవలం 20 రూపాయలు చెల్లించి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చని ఈ సందర్భంగా అక్కడి పోస్టుమాస్టర్ ఎస్ వెంకన్న, పోస్టల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, సీనియర్ పోస్టల్ అసిస్టెంట్ సంతోష్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన కామర్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ టి.ఎస్ ప్రవీణ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ ఇలాంటి వినూత్న విభిన్న పాఠ్యాంశ, పాఠ్యాంశేతర కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మేడ తిరుపతి, డాక్టర్ కాంపల్లి శంకర్, అధ్యాపకులు పి రవి, ఓ కిషన్, కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారు.