మరికల్ మండల తాహసిల్దార్ కు వినతి….
అక్షర విజేత, మరికల్/ ధన్వాడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 757 లో గల గతంలో అంతర్గత రహదారి ఉండెను ఇట్టి రహదారి ఆక్రమించుకొని దుకాణాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది దీంతో అంతర్గత రహదారి కి కట్టెలతో అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి కావున రహదారిపై అడ్డుకట్ట వేసిన వ్యక్తులపై నాలా అనుమతులు తీసుకొని అట్టి రహదారిపై దుకాణాల నిర్మాణం చేశారు ఇట్టి విషయమై సర్వే నంబరు 757 కు సంబంధించిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి కావున అట్టి స్థలం పై పరిశీలించి వాస్తవాలను తెలుసుకొని అట్టి దుకాణాలను నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మనవి. గతంలో ఇట్టి రోడ్డుకు పనికి ఆహార పథకం కింద మొరం పని చేయడం కూడా జరిగింది .ఇట్టి విషయంపై సర్వే అధికారులకు చెప్పి సర్వే చేయాలని కోరుతున్నాము. లేనియెడల నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాము. అట్టి రహదారిపై దుకాణాలు నిర్మాణం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. మరికెల్లో ఉన్న ధర్మన్న కుంట చెరువు పై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.