వరి పంటకు బోనస్, రుణమాఫీ,రైతుబంధు, తక్షణమే అమలు చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం
అక్షర విజేత దేవరకద్ర
కౌకుంట్ల మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో రైతులకు తక్షణమే రైతు రుణమాఫీ, వరి పంటకు 500 బోనస్, రైతుబంధు అందరికీ తక్షణమే అమలు చేయాలని,బిజెపి పార్టీ మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ,బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రామరాజు ,అనిల్ కుమార్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు గుండాల రాఘవేందర్ గౌడ్ వివిధ మౌర్చలా అధ్యక్షులు కార్యదర్శులు కలిసి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి,తాసిల్దార్ ఎల్లయ్యకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బడుగుల రాజు, కోట్ల శీను, గుముడాల శ్రీనివాసులు గౌడ్, వడ్ల బాలరాజు, శివ చారి, మరియు వివిధ గ్రామాల బిజెపి నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.