వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
అక్షర విజేత మోర్తాడ్
ఎరుగట్ల మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటి పనుల వసూళ్లు కొనసాగిస్తున్న కార్యదర్శుల, కారోబర్ల ,ప్రత్యేక ఇంటి పన్నుల బృందం పనితీరును ఆర్మూర్ డివిజన్ పంచాయతీరాజ్ అధికారి శివకృష్ణ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఇప్పటి వరకు మొత్తం 78 వేల 600 రూపాయలు వసూలు అయినట్లు కార్యదర్శులు, డివిజన్ అధికారికి వివరించారు. అనంతరం డివిజన్ పంచాయతీరాజ్ అధికారి శివకృష్ణ ఎరుగట్ల మండల కార్యదర్శుల తో, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో ఇంటి పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతిరోజు గ్రామాలలో సందర్శించి, పరిశీలించి తాగునీటిని సక్రమంగా అందించాలన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏరుగట్లమండల కార్యదర్శులు, కారోబర్లు, తదితరులు పాల్గొన్నారు.